Home  »  TV News  »  Karthika deepam2 :  దీపకు శ్రీధర్ హెచ్చరిక.. జ్యోత్స్న కుట్రలను బయటపెట్టిన సూరజ్!

Updated : May 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -682 లో.....తాత నువ్వు నేర్పిన ధర్మానికి కట్టుబడి ఒక ప్రాణం కాపాడాను.. ఇక నువ్వు నేర్పిన ధర్మం వదిలేయమని చెప్పు ఇప్పుడే వదిలేస్తానని కార్తీక్ అంటాడు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను చేసింది నువ్వు తప్పు అని భావిస్తున్నావ్ .. ఇక నేను ఈ ఇంట్లో ఉండనని కార్తీక్ వెళ్లిపోతుంటే శివన్నారాయణ తన చెయ్ పట్టుకొని ఆపుతాడు. కొద్దిసేపు నా ధర్మం మర్చిపోయి ప్రవర్తించాను.. ప్రాణం కాపాడినవాడు గొప్పోడు.. ఇప్పుడు జరిగింది నేను గుర్తుపెట్టుకోను..... కాంచన నీ కొడుకుని గొప్పగా పెంచావని శివన్నారాయణ అంటాడు.

ఆ తర్వాత దీప జాగ్రత్త అమ్మ.. ఇక్కడ మంచివాళ్ళ కంటే చెడ్డవాళ్లే ఎక్కువ అని జ్యోత్స్నని ఉద్దేశ్శించి దీపతో శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఇంత జరిగాక ఆ కార్తీక్ గాడు వదిలి పెట్టడని పారిజాతం అంటుంది. నన్ను వేలెత్తి చూపేవాళ్ళు లేరు గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే శివన్నారాయణ ఇంటికి సూరజ్ వస్తాడు‌. అతన్ని కార్తీక్, దీప చూసి ఏంటి బ్రో ఇక్కడ అని అడుగుతారు. మొన్న జరిగిన దానికి నష్టపరిహారం అడగడానికి వచ్చానని సూరజ్ అనగానే కరెక్ట్ టైమ్ కీ ఎంట్రీ ఇచ్చావని కార్తీక్ అంటాడు. కార్తీక్ ఇంట్లో అందరిని పిలుస్తాడు. సూరజ్ ని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది‌. ఏంట్రా నువ్వు ఇక్కడ అని కోప్పడుతుంది. మేడమ్ రెస్పెక్ట్ ఇవ్వండి అని సూరజ్ అంటాడు. అసలు ఏం జరిగిందో సూరజ్ చెప్తాడు.

నేను రోడ్డు పక్కన స్టాల్ లో హెల్త్ ఫ్రూట్స్ అమ్ముతుంటే పర్మిషన్ లేదని కూల్చేసారు.. అదంతా కావాలనే మేడమ్ చేసింది.. అందుకు సాక్ష్యం కార్తీక్ గారు అని సూరజ్ చెప్తాడు. మొన్న నేను ఇంటికి లేట్ గా రావడానికి కారణం నువ్వే.. దానికి కౌంటర్ ఇదే అని సూరజ్ తో జ్యోత్స్న అన్న వీడియో క్లిప్ ని సూరజ్ చూపిస్తాడు. దాంతో జ్యోత్స్న మొహం వాడిపోతుంది. ఆ రోజు జరిగిన దానివళ్ళ నా స్టాల్ పై కొట్టారు.. నా పొట్ట మీద కొట్టింది.. అందుకు నష్టపరిహారం కావాలని వచ్చానని సూరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.